భారతదేశపు అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ
- August 29, 2024
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. తాజాగా వెలువడిన 2024 హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. ఇక రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. కాగా, అదానీ స్థానం భారతీయ వ్యాపార రంగంలో అతని ఆధిపత్య ఉనికిని చాటిందనే చెప్పాలి. ఆయన సంపద ఏడాది కాలంలోనే ఏకంగా 95 శాతం పెరగడం గమనార్హం.
అటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ రూ. 3.14 లక్షల కోట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. అలాగే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ ఎస్. పూనావాలా రూ. 2.89 లక్షల కోట్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు. గత ఏడాదిలో మన దగ్గర ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చినట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇండియాలో ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే 75 మంది పెరిగినట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







