యూఏఈలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- August 31, 2024
యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ సెప్టెంబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇంధన ధరలు ప్రతి నెలా చమురు ప్రపంచ ధరల ప్రకారం నిర్ణయిస్తుంది. ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ ఆగస్టులో ధరలతో పోల్చితే లీటరుకు 15 ఫిల్స్ చొప్పున తగ్గించింది. కొత్త రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
-సూపర్ 98 పెట్రోల్ ధర ఆగస్టులో 3.05 దిర్హాంలు ఉండగా..ఇప్పుడు లీటరుకు 2.90 దిర్హాంలు అవుతుంది.
-ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.78 అయింది. ప్రస్తుత దీని ధర Dh2.93గా ఉంది.
- E-Plus 91 పెట్రోల్ ధర ఆగస్టులో Dh2.86గా ఉండగా, ఇప్పుడు లీటరుకు 2.71 దిర్హాలు అవుతుంది.
-ప్రస్తుతం డీజిల్ ధర 2.95 దిర్హాం కాగా, దానిని 2.78 దిర్హామ్లకు తగ్గించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







