22 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా హెలికప్టర్ గల్లంతు..!
- August 31, 2024
న్యూఢిల్లీ: రష్యాలో ఓ హెలికాప్టర్ మిస్సైంది. రష్యన్ ఫార్ ఈస్ట్లోని కమ్చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది. 22 మందిలో 19 మంది ప్రయాణికులు కాగా, మరో ముగ్గరు సిబ్బంది. ఈ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. మిస్సైన హెలికాప్టర్ ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్లైన్కు చెందినదని స్థానిక మీడియా నివేదించింది. వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సందర్శన సమయంలో ఇది అదృశ్యమైనట్లు పేర్కొంది. కమ్చట్కా ప్రాంతంలోని వాచ్ కాజెట్స్ నుంచి బయల్దేరిన ఈ హెలికాప్టర్.. షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదని తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!