అరేబియా సముద్రంలో తీరం దాటనున్న తుఫాన్.. అలెర్ట్ జారీ..!
- August 31, 2024
యూఏఈ: అరేబియా సముద్రంలో నెలకొన్న తుఫానును పర్యవేక్షిస్తున్నట్టు యూఏఈ అధికారులు తెలిపారు. అయితే, దేశంపై దీని ప్రభావం నేరుగా ఉండదని ప్రాథమిక రీడింగ్‌లు సూచిస్తున్నాయని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) తెలిపింది. కాగా, తుఫాన్ ప్రభావం కొన్ని తీర ప్రాంతాల్లో ఉండవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో తుఫాన్ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలో గంటకు 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని NCM తెలిపింది. పుకార్లు వ్యాప్తి చేయవద్దని నివాసితులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!