బిగ్బాస్ తెలుగు 8 వ సీజన్ కలర్ ఫుల్గా ప్రారంభం.!
- September 02, 2024
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సారి బిగ్బాస్ సీజన్ స్టార్టవ్వడానికి ముందుగా ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ కాకపోవడం విశేషం.
ప్రతీసారీ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే అనేక రకాల వివాదాలూ.. గొడవలు.. కానీ, ఈ సారి అలాంటివేమీ లేకుండా సైలెంట్ ప్రమోషన్లతోనే బిగ్బాస్ గేమ్ షో స్టార్ట్ అయ్యింది.
ప్రచారంలో వున్నట్లే కొంత మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్య రాజ్ తరుణ్ ఇష్యూతో పాపులర్ అయిన శేఖర్ భాషా అందులో ఒకరు.
14 మంది కంటెస్టెంట్లతో బిగ్బాస్ షో స్టార్ట్ అయ్యింది. ఈ సారి గో విత్ బడ్డీ.. అంటూ జంటలు జంటలుగా హౌస్లోకి కంటెస్టెంట్లను పంపించాడు హోస్ట్ నాగార్జున.
‘35 ఒక చిన్న కథ కాదు’ మూవీ టీమ్ రానా, విశ్వదేవ్, నివేదా థామస్.. ‘సరిపోదా శనివారం’ టీమ్ నాని, ప్రియాంకా అరుళ్ మోహన్, అనిల్ రావిపూడి తదితర గెస్ట్లు ఫస్ట్ డే హౌస్లోకి ఆయా కాన్సెప్టులతో వెళ్లి కంటెస్టెంట్లతో సందడి చేశారు.
ఈ సారి అంతా అన్లిమిటెడ్.. అనే క్యాప్షన్తో బిగ్బాస్ షో స్టార్ట్ అయ్యింది. మరి, ఎలాంటి అన్లిమిటెడ్ స్టఫ్ బిగ్బాస్ ఇవ్వబోతోందో చూడాలిక.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..