ఘనంగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.!

- September 02, 2024 , by Maagulf
ఘనంగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.!

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్‌గా జరిగిన ఈ వేడకకు చిరంజీవి గెస్ట్‌గా రావడంతో పాటూ, విక్టరీ వెంకటేష్ కూడా విచ్చేశారు. అయితే, ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా విచ్చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అల్లు అర్జున్ హాజరు కాలేదు.

అలాగే ఎన్టీయార్ కూడా ఈ వేడకలో  కనిపించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవరాల్‌గా చూస్తే ఈ జనరేష్ హీరోలెవ్వరూ ఈ వేడకకు హాజరు కాలేదు. కాగా, ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యనుద్దేశించి చేసిన స్పీచ్ అద్భుతంగా వుందని మాట్లాడుకుంటున్నారు.

అలాగే, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్.. ఇలా ముగ్గురు సీనియర్ హీరోలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు పండగలా అనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com