స్పెషల్ బర్త్‌డే.! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి పోటెత్తుతున్న శుభాకాంక్షలు.!
- September 02, 2024
ప్రతీ ఏడాదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే అంటే అభిమానులకి పండగే. అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ బర్త్‌డే మరింత స్పెషల్. సినిమాల నుంచి వచ్చి.. ప్రజలకు సేవ చేయాలన్న నిస్వార్ధమైన ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు కాదు ఓ శక్తి పవన్ కళ్యాణ్.
దాదాపు పదేళ్లుగా ఎన్నో అవమానాలు.. మరెన్నో నిందలూ అన్నీ ఓర్చి ఈ ఎలక్షన్స్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచారాయన. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆ పదవికి ఎంతో ఉన్నత స్థాయిని తీసుకొచ్చిన లీడర్ పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ అంటే యువత భవిష్యత్తు.. పవన్ కళ్యాణ్ అంటే ఆపదలో వున్న ఆడపిల్లలు చేతికి కట్టే రాఖీ. రైతులకు ఆపన్న హస్తం.. ఇలా ఒక్కటేమిటి.. ఆయన ఓ పవర్.. ఆ పవర్‌కే అర్ధం తెలిపిన వ్యక్తి.
అలా ఈ ఏడాది ఆయన బర్త్‌డేని అభిమానులు మరింత సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం వానలు, వరదల కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారనీ, తన బర్త్ డే వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేయొద్దని అభిమానులకు తెలిపారాయన. సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







