విష్ణుప్రియ ‘బిగ్’ ఛేంజ్.! అప్పుడలా.! ఇప్పుడిలా.!
- September 02, 2024
బుల్లితెర హాటెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణు ప్రియ తాజాగా బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. గతంలోనూ విష్ణు ప్రియ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అట.. అని కొన్ని సీజన్లలో ప్రచారం జరిగింది.
కానీ, అప్పుడు ఆమె హౌస్‌లో కనిపించలేదు. అందుకు కారణం తనకు బిగ్‌బాస్ అంటే ఇష్టం లేదనీ, బయటి ప్రపంచం చాలా కలర్ ఫుల్‌గా వైడ్‌గా వుంటుందనీ, అలాంటి ప్రపంచాన్ని వదిలి పెట్టి ఒకే హౌస్‌లో బంధీగా వుండడమేంటీ.?
ఈ తరహా కాన్సెప్ట్‌ని నేను అంగీకరించను.. ఎంకరేజ్ చేయను..’ అని చెప్పింది. గతంలో విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బిగ్‌బాస్ గురించి అప్పుడు అలా చెప్పిన విష్ణు ప్రియ ఇప్పుడెందుకు హౌస్‌లోకి వచ్చింది.? బాగా ముట్ట చెప్పి వుంటారా రెమ్యునరేషన్.! లేదంటే మరేదైనా కారణముందా.? అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఏది ఏమైతేనేం, కాస్త తెలిసిన మొహం అంటే ప్రస్తుత సీజన్‌కి విష్ణు ప్రియనేనేమో. హీరో ఆదిత్య ఓంతో పాటూ కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు.. సీరియల్ ఆర్టిస్టులు.. ఇలా 14 మంది కంటెస్టెంట్లతో ఈ సారి బిగ్‌బాస్ ముస్తాబయ్యింది.
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







