కండలు కరిగేలా కసరత్తులు చేస్తున్నారా.? ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమీ.!
- September 02, 2024
ఫిట్‌గా వుండాలంటే కొన్ని రకాల వ్యాయామాలు చేయాల్సి వుంటుంది. చిన్న చిన్న ఎక్సర్‌సైజులు కావొచ్చు.. అలాగే భారీ కసరత్తులు కావచ్చు. ఎలాంటి వ్యాయామాలు చేసినా వాటితో పాటూ డైట్ కేరింగ్ కూడా అత్యవసరం.
వ్యాయామానికి ముందూ ఆ తర్వాత కూడా కొన్ని రకాల ఫుడ్ కేరింగ్స్ తీసుకోవాలి. వ్యాయామానికి ముందు ప్రొటీన్స్ ఎక్కువగా వున్న ఫుడ్ తీసుకోవాలి. అలాగే, ఫైబర్, ఫ్యాట్స్ వున్న ఫుడ్ కూడా భాగం చేసుకోవాలి.
ఉడికించిన గుడ్డు, అరటి పండు వంటి ఆహారం వ్యాయామానికి ముందు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, తిన్న తర్వాత గంట సమయం తీసుకున్నాకే వ్యాయామానికి సన్నద్ధం కావాలి. గంట లోపు వ్యాయామం చేస్తే అనవసరమైన అనారోగ్య సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు.
అలాగే వ్యాయామం తర్వాత రాగి మాల్ట్, మొలకెత్తిన గింజలు తదితర ఆహారాల్ని కంపల్సరీ తీసుకోవడంతో పాటూ రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చు.
అతిగా బరువులు గట్రా మోసే వ్యాయామాలు చేసే వారు చేపలు, చికెన్, గుడ్లు వంటి ప్రొటీన్స్ ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలు.. అలాగే పాలు, పెరుగు వంటి కార్భొహైడ్రేట్స్ వున్న ఆహార పదార్ధాల్నివాటితో పాటూ మంచి పోషకాలున్న డైట్ తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు చెమట రూపంలో శరీరం నుంచి ఎక్కువగా వాటర్ బయటకి పోతుంది. అందుకే కావల్సినంత వాటర్ కంటెంట్ శరీరానికి అందిస్తూ వుండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామం చేసేవారిలో ఎలాంటి అనారోగ్య సమస్యల్లేకుండా ఫిట్‌గా వుండే అవకాశముంటుంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..