గ్లోబల్ విలేజ్.. ప్రారంభం కానున్న 29వ సీజన్..!
- September 02, 2024
దుబాయ్: గ్లోబల్ విలేజ్ సీజన్ 29 త్వరలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 16న ప్రారంభించనున్నట్లు అవుట్డోర్ డెస్టినేషన్ ప్రకటించింది. ఈ సీజన్ మే 11, 2025 వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ సంవత్సరం గ్లోబల్ విలేజ్ తన ఆఫర్లను విస్తరిస్తోంది. ఈసారి మరిన్ని సాంస్కృతిక వైవిధ్యాలు కనువిందు చేయనున్నాయి. 28వ సీజన్లో గ్లోబల్ విలేజ్ 10 మిలియన్ల సందర్శకులతో కొత్త రికార్డును నెలకొల్పింది. గత సీజన్లో 400 మంది కళాకారులు 27 పెవిలియన్లలో 90కి పైగా సంస్కృతులు ప్రదర్శించారు. ఈ సీజన్లో 200 కంటే ఎక్కువ రైడ్లు, వినోద ఆకర్షణలు మరియు 3,500 షాపింగ్ అవుట్లెట్లు, 250 డైనింగ్ ఎంపికలు ఉన్నాయి. గ్లోబల్ విలేజ్ టిక్కెట్లు సాధారణంగా మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, 65 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు, దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







