వైభవంగా జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్

- June 18, 2016 , by Maagulf

63 వ ఫిలింఫేర్ అవార్డ్స్ (సౌత్) వేడుక శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందిన నటీనటులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన సినీ ప్రముఖులతో ఆ ప్రాంగణం కోలాహాలంగా మారింది. ఇక ఈ కార్యక్రమాన్ని చిన్మయి, రాహుల్ రవీంద్ర హోస్ట్ చేశారు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ మేల్ విభాగంలో మహేష్ బాబు శ్రీమంతుడు (తెలుగు) చిత్రానికి, పునీత్ రాజ్‌కుమార్ రానావిక్రమ (కన్నడ), విక్రమ్ ఐ(తమిళం), మమ్ముట్టి పతేమరి (మలయాళం) గాను అవార్డు అందుకున్నారు. ఇక ఫీమేల్ విభాగంలో అనుష్క శెట్టి రుద్రమదేవి( తెలుగు), పార్వతి ఎన్ను నిన్టే మొయిదీన్ (మలయాళం), పరుల్ యాదవ్ ఆటాగరా ( కన్నడ), నయనతార నానుం రౌడీదాన్ (తమిళ) చిత్రాలకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్నారు.
ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి బాహుబలి ( తెలుగు) చిత్రానికి అవార్డు అందుకోగా, ఆర్ ఎస్ విమల్ ఎన్ను నిన్టే మొయిదీన్(మలయాళం), అనూప్ బండారీ రంగీ తరంగ(కన్నడ), మోహన్ రాజా తనీ ఒరువన్ (తమిళం)చిత్రాలకు బెస్ట్ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ మూవీ విషయానికి వస్తే తెలుగులో బాహుబలి, పతేమరి (మలయాళం), రంగీ తరంగ (కన్నడ), కాకా ముైట్టె (తమిళం) చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి.తెలుగులో అఖిల్ సినిమాకిగాను అఖిల్ అక్కినేని బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో అవార్డ్ అందుకోగా , కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో అవార్డ్ కైవసం చేసుకుంది. ఇక రెడ్ కార్పెట్ పై నాలుగు భాషల తారలు వివిధ డ్రెస్సుల్లో తమ అందాలు ఆరబోసారు. స్టేజ్ పై హీరోయిన్స్ డ్యాన్స్ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇంక ఇవే కాక పలు విభాగాలలో పలువురు కళాకారులు ఈ ఫిలింఫేర్ అవార్డులను తమ సొంతం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com