భారత్ లో 6 కొత్త మార్గాలతో కార్యకలాపాలను విస్తరించిన ఫ్లిక్స్ బస్

- September 03, 2024 , by Maagulf
భారత్ లో 6 కొత్త మార్గాలతో కార్యకలాపాలను విస్తరించిన ఫ్లిక్స్ బస్

హైదరాబాద్: సరసమైన, పర్యావరణ అనుకూల ప్రయాణానికి గ్లోబల్ ట్రావెల్-టెక్ లీడర్ అయిన ఫ్లిక్స్‌బస్ ఇండియా చెన్నై, హైదరాబాద్ నుండి బెంగళూరుకు రోజువారీ బస్సు సర్వీసులను ప్రారంభించడం ద్వారా దక్షిణ భారతదేశానికి తన కార్యకలాపాలను విస్తరించింది. 3 సెప్టెంబర్ 2024న, కర్ణాటక ప్రభుత్వ వాణిజ్య అండ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల మంత్రి, ఎం బి పాటిల్, అంతర్జాతీయ ఫ్లిక్స్ నాయకులు మాక్స్ జ్యూమర్ (COO) సహ వ్యవస్థాపకుడు డేనియల్ క్రాస్‌ సమక్షంలో బెంగళూరులోని రిట్జ్ కార్ల్‌టన్‌లో చెన్నైకి వెళ్లే మార్గాన్ని ప్రారంభించారు.

ఫ్లిక్స్‌బస్ ఇటీవల 33 నగరాలను, 200కు పైగా రోజువారీ సంబంధాలను కలుపుతూ 6 కొత్త మార్గాలను పరిచయం చేయడంతో సౌత్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈసంద‌ర్భంగా కర్ణాటక ప్రభుత్వ వాణిజ్యం అండ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల మంత్రి ఎం.బి పాటిల్ మాట్లాడుతూ… ఫ్లిక్స్‌బస్ కర్ణాటక అండ్ దక్షిణ భారతదేశ ప్రాంతంలోని ప్రజల సుదూర మొబిలిటీ అవసరాలను సాంకేతికతతో నడిచే, సామూహిక రవాణా ప్రత్యామ్నాయంతో పరిష్కరిస్తుందన్నారు. ప్రజలు ఇప్పుడు పర్యావరణం పై అవగాహన పెంచుకున్నారన్నారు.

ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎండి సూర్య ఖురానా మాట్లాడుతూ… త‌మ భారతీయ పోర్ట్‌ఫోలియోలో తాజా చేరికగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లను స్వాగతిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. ఉత్తర భారతదేశంలో విజయవంతంగా కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత, దక్షిణ భారతదేశానికి విస్తరించడం అనేది దేశవ్యాప్తంగా ఇంటర్‌సిటీ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి త‌మ ప్రయాణంలో సహజమైన తదుపరి దశ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com