‘బిగ్’ హౌస్‌లో అందాల రాక్షసి.!
- September 04, 2024
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఓ కంటెస్టెంట్. రామ్ గోపాల్ వర్మ హీరోయిన్లలో ఒకరీ అందాల భామ. అందుకే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజే రామ్ గోపాల్ వర్మ స్పెషల్‌గా విషెస్ తెలిపారీ ముద్దుగుమ్మకి.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి దిగుమతి అయింది కదా.. అందుకేనేమో.. ఆ లెగసీని బాగా ఫాలో చేస్తున్నట్లుంది.
అవసరమున్నా.. లేకున్నా హౌస్‌లో గొడవలకు దిగుతోంది. ఊరికూరికే అనవసరంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తోంది.
మొన్నేమో ఆరెంజ్‌తో ఆడుకుంటున్నారనీ కొందరు హౌస్ మేట్స్‌పై గొడవకు దిగింది. అందంగా కనిపిస్తూనే నవ్వులు చిందిస్తూనే పెద్దగా నోరేసుకుని పడిపోతోంది.
నిన్నేమో నామినేషన్ల పర్వం నేపథ్యంలో తోటి కంటెస్టెంట్ అయిన ప్రేరణతో చాలా పెద్ద రచ్చే చేసింది. ఇలా ఒక్కటి కాదు.. మూడు రోజుల్లోనే అమ్మడి కాంట్రవర్సీలు అలా ఇలా లేవు. కేక పుట్టిస్తున్నాయ్. ఎంతైనా ఆర్జీవీ బొమ్మ కదా.! ఆ మాత్రం వుంటుందిలే అంటున్నారు సోనియా గురించి తెలిసిన వారు. అయినా బిగ్‌బాస్‌కి కావల్సిందిదేగా.. అందుకు తగ్గట్లుగానే అమ్మడు మంచి స్టఫ్ ఇస్తుందిలే అంటున్నారు ఇంకొందరు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







