వైష్ణవ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే.!

- September 04, 2024 , by Maagulf
వైష్ణవ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే.!

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్‌కి తొలి సినిమా ఇచ్చిన కిక్కు మరే సినిమా ఇవ్వలేదింతవరకూ. ‘ఉప్పెన’ సినిమాతో రికార్డులు బద్దలుకొట్టాడీ కుర్ర హీరో.

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద సో సోగా నిలిచాయ్. తాజాగా వైష్ణవ్ తేజ్ ఓ కొత్త కథతో రాబోతున్నాడనీ తెలుస్తోంది.

వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకుని ఆచి తూచి కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆ క్రమంలోనే కృష్ణ చైతన్య నెరేట్ చేసిన ఓ కథకు ఓకే చేశాడనీ తాజా సమాచారం.

ఈ సినిమాకి ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కథ పరంగా చూస్తే ఓ కొత్త నేపథ్యమున్న కథనీ తెలుస్తోంది.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి లేటెస్ట్‌గా దర్శకత్వం వహించాడు కృష్ణ చైతన్య. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన  ఈ సినిమా దర్శకుడిగా కృష్ణ చైతన్యకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.

కానీ, వైష్ణవ్ తేజ్‌ని మాత్రం ఓ కొత్త యాంగిల్‌లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలింకా తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com