నకిలీ భారతీయ కరెన్సీ కల్గి ఉన్న బహ్రెయిన్ ప్రవాసీయుడు అరెస్టు
- June 19, 2016
ఒక బహరేన్ ప్రవాసీయుడు నకిలీ భారతీయ కరెన్సీ నోట్లును తన స్వస్థలంలో కల్గి ఉండటంతో అరెస్టు చేశారు. భారత పోలీసుల కధనం ప్రకారం దక్షిణ భారతదేశ కేరళ రాష్ట్రం పయ్యన్నుర్ అనే గ్రామంలో మద్యం దుకాణం నుండి ఒక వ్యక్తి కొనుగోలుచేసేందుకు నకిలీ నోట్లు ఉపయోగించినట్లు తెలిపారు. దుకాణంలో పని చేసి సిబ్బంది రోజూ సేకరణ నగదుని తమ బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటానికి వెళ్ళినపుడు ఐ ఎన్ అర్ 500 ( దాదాపు 2.8 బి.డి విలువ కల ) నకిలీ కరెన్సీ అని బ్యాంకు అధికారులు తెలియజేసారు.తమ ఖాతాదారుడు ఎవరు నకిలీ నోట్ ఇచ్చేరో తెలుసుకొనేందుకు మద్యం ధుకాణదారుదు వేచి ఉన్నాడు.ఒక రోజు తరువాత మద్యం దుకాణంలో మరో మూడు నకిలీ ఐ ఎన్ అర్ 500 నోట్లు రావడం గమనించి తమకు నకిలీ నోట్లు ఇచ్చిన బిజూ కె ను పోలీసులు వచ్చే వరకు నిర్బంధించి ఉంచారు. బహరేన్ నుంచి సెలవుపై స్వదేశంకు దాదాపు 10 రోజుల గడుపుదామని వచ్చిన బిజూ కె నకిలీ నోట్ల చెలామణి కేసులో చిక్కుకొన్నాడు.పోలీసులు ఆ వ్యక్తి ఇంటి నుంచి 43 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకొని బిజూ కె ను అరెస్ట్ చేసారు. ఒక వివరణాత్మక పరిశోధనని భారతీయ పోలీసులు ఇప్పుడు ప్రారంభించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









