1800 కంపెనీలు..3 వారాల్లో 352 ఉల్లంఘనలు..!

- September 05, 2024 , by Maagulf
1800 కంపెనీలు..3 వారాల్లో 352 ఉల్లంఘనలు..!

యూఏఈ: యూఏఈలో 1.5 మిలియన్ల మంది కార్మికులు లేబర్ వసతి గృహాలలో నివసిస్తున్నారని అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) ఎలక్ట్రానిక్ లేబర్ అకామోడేషన్ సిస్టమ్‌లో 1,800 కంటే ఎక్కువ కంపెనీలు నమోదు అయినట్లు తెలిపారు. కార్మికుల నివాస సౌకర్యాలలో 352 ఉల్లంఘనలను గుర్తించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లంఘనలలో వెంటిలేషన్ లేకపోవడం, ఎయిర్ కండిషనింగ్, పారిశుధ్య అవసరాలను తీర్చడంలో వైఫల్యం, సాధారణ పరిశుభ్రత సమస్యలు ఉన్నాయి.  మే 20 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరిగిన తనిఖీల అనంతరం నిబంధనలు పాటించని కొన్ని కంపెనీలను హెచ్చరించినట్టు MoHRE తనిఖీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సిన్ అలీ అల్ నస్సీ వెల్లడించారు. లేబర్ క్యాంపులలో శుభ్రమైన, చల్లటి నీటి సరఫరా, బెడ్‌రూమ్ మరియు వాష్‌రూమ, పారిశుద్ధ్య సేవలు, కార్మికులకు ఒక్కొక్కరికి కనీసం మూడు చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉండాలన్నారు. లేబర్ వసతి ఆరోగ్యం, సౌకర్యం మరియు పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఇన్‌స్పెక్టర్లు నిర్ధారిస్తారని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com