ఒమన్ లో పెట్టుబడి అవకాశాల పై భారత బృందం ఫోకస్..!
- September 05, 2024సోహర్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) శాఖ ఇండియా నుండి వ్యాపార ప్రతినిధి బృందంతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒమన్ లో పర్యటిస్తున్న భారత ప్రతినిధి బృందంలో 30 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు.ఈ సమావేశంలో ఆహార పదార్థాలు, వ్యవసాయం, నిర్మాణ వస్తువులు, సౌందర్య సాధనాలు, ఔషధం, ప్లాస్టిక్‌లు, వస్త్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలు వంటి వివిధ రంగాలలో వ్యాపార భాగస్వామ్యాన్ని నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వాణిజ్య సహకారాన్ని విస్తరించడం, నైపుణ్యం మరియు సమాచారాన్ని పరస్పరం షేర్ చేసుకోవడం, ఉమ్మడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం కోసం ఒమన్ –ఇండియాకు చెందిన వ్యాపారవేత్తల మధ్య B2B సమావేశాలు జరిగాయని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన నార్త్ అల్ బతినా గవర్నరేట్ బ్రాంచ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సయీద్ బిన్ అలీ అల్ అబ్రి తెలిపారు. ఒమన్, ఇండియా మధ్య వాణిజ్య మార్పిడి గత చివరి నాటికి $3 బిలియన్లకు చేరుకుందన్నారు. ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడం, మల్టీ వాణిజ్య రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం గురించి ప్రతినిధుల బృందాలు చర్చిస్తున్నాయని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. భారతీయ ఎగుమతి సంస్థల ప్రాంతీయ సమాఖ్య అధ్యక్షుడు, భారత ప్రతినిధి బృందం అధిపతి పరేష్ మెహతా మాట్లాడుతూ.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, రెండు దేశాల ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి పెట్టుబడి అవకాశాలను సృష్టించడానికి ఇండియా శ్రద్ధగా కృషి చేస్తోందన్నారు.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్