ప్రజారోగ్యానికి హాని.. అబుదాబిలో రెస్టారెంట్ సీజ్
- September 05, 2024యూఏఈ: ఆహార చట్టాలను ఉల్లంఘించినందుకు రాజధాని నగరంలో ఒక రెస్టారెంట్‌ను అబుదాబి అథారిటీ సీజ్ చేసింది. అబుదాబిలోని ఖలీదియా ప్రాంతంలో ఉన్న అమీర్ అల్ షామ్ రెస్టారెంట్, గ్రిల్స్‌ను పరిపాలనాపరంగా మూసివేయాలని అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆదేశించింది. అబుదాబి ఎమిరేట్‌లోని ఫుడ్ సంబంధిత చట్టాలకు సంబంధించి 2008 నాటి చట్టం నంబర్ (2)ను రెస్టారెంట్ ఉల్లంఘిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ రెస్టారెంట్ పద్ధతులు ప్రజారోగ్యానికి ప్రమాదాన్ని కలిగించేలా ఉన్నాయని అధికారుల తనిఖీల్లో గుర్తించినట్టు అధికారులు తమ నివేదికల్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?