కువైట్ లో బయోమెట్రిక్స్ కు 8 లక్షల మంది ప్రవాసులు దూరం .!
- September 05, 2024
కువైట్: దాదాపు 800,000 మంది నివాసితులు ఇప్పటికీ తమ బయోమెట్రిక్ వేలిముద్రలను తీసుకోలేదని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్‌లోని వ్యక్తిగత పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగ్ జనరల్ నయీఫ్ అల్-ముతైరి తెలిపారు. దాదాపు 1,068,000 మండివి పూర్తయ్యాయి. పౌరుల విషయానికొస్తే, సుమారు 800,000 మంది కువైటీలు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేసారు.ఇంకా 175,000 మంది పౌరులు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంది. పౌరులు తమ బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయడానికి గడువు సెప్టెంబర్ 30, నివాసితులకు డిసెంబర్ 31 వరకు సమయం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినట్లుగా సంబంధిత గడువులోగా బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయని వారి కోసం అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని అల్-ముతైరీ చెప్పారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







