దుబాయ్‌లో మరో ఆకర్షణ..ప్రపంచంలోని రెండవ ఎత్తైన టవర్ నిర్మాణం..!
- September 05, 2024
యూఏఈ: దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్ మరో టూరిస్ట్ స్పాట్ కానుంది. ప్రపంచంలోని రెండవ ఎత్తైన టవర్ బుర్జ్ అజీజీ ఎత్తును అజీజీ డెవలప్‌మెంట్స్ వెల్లడించింది. ఇది 725 మీటర్ల పొడవు ఉంటుందాని తెలిపింది. ఇది 131-ప్లస్-అంతస్తులుండే దీనిని ఫిబ్రవరి 2025లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 2028 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. టవర్‌లో ఏడు సాంస్కృతిక థీమ్‌ల ప్రేరణతో ఆల్-సూట్ సెవెన్-స్టార్ హోటల్ మరియు పెంట్‌హౌస్‌లతో సహా అపార్ట్‌మెంట్లు, హాలిడే హోమ్‌లు, బుర్జ్ అజీజీ వెల్‌నెస్ సెంటర్‌లు, స్విమ్మింగ్ పూల్స్, సినిమాస్, జిమ్‌లు, మినీ మార్కెట్‌లు, రెసిడెంట్ లాంజ్‌లు, పిల్లల ఆట స్థలం లాంటి అనేక రకాల సౌకర్యాలను ఇది అందిస్తుంది. టవర్‌లో ఏడు అంతస్తులలో రిటైల్ సెంటర్, విలాసవంతమైన బాల్‌రూమ్ మరియు బీచ్ క్లబ్ ఉన్నాయి. 11వ స్థాయిలో ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ లాబీ, లెవల్ 126లో ఎత్తైన నైట్‌క్లబ్, లెవల్ 130లో అత్యధిక అబ్జర్వేషన్ డెక్, లెవెల్ 122లో దుబాయ్‌లోని ఎత్తైన రెస్టారెంట్ వంటి ప్రపంచ రికార్డులను నమోదు చేయనుందని అజీజీ డెవలప్‌మెంట్స్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ మిర్వాయిస్ అజీజీ ప్రకటించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..