73 ఏళ్ల భారతీయ ప్రవాసుడి జీవితంలో వెలుగులు నింపిన క్షమాభిక్ష పథకం..!

- September 05, 2024 , by Maagulf
73 ఏళ్ల భారతీయ ప్రవాసుడి జీవితంలో వెలుగులు నింపిన క్షమాభిక్ష పథకం..!

యూఏఈ: రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమంలో చాలా మంది అక్రమ నివాసితులు తమ వీసా స్థితిని సరిదిద్దడానికి ముందుకు వచ్చారు. క్లిష్టపరిస్థితుల్లో వారికి ఊపిరి పోసింది. ప్రతికూల జీవిత పరిస్థితులు 73 ఏళ్ల భారతీయ ప్రవాస అలీని ఐదేళ్ల క్రితం దుబాయ్‌కి రప్పించింది. "నేను 1992 నుండి కొన్ని సంవత్సరాల క్రితం వరకు యూఏఈలో పనిచేశాను." అని మమ్జార్‌లోని అమెర్ సెంటర్‌లో తెలిపాడు. “కానీ నా రెండవ కొడుకు ప్రమాదానికి గురయ్యాడు. మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి అతనికి ఆపరేషన్ అవసరం. కాబట్టి, ఆ ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి నేను యూఏఈకి తిరిగి రావలసి వచ్చింది.” అని చెప్పారు.

కుక్‌గా అతని మొదటి వర్క్ వీసా గడువు ముగిసిన తర్వాత మరొక కుటుంబం నియమించుకుందని తెలిపారు. తన వయస్సు కారణంగా  వీసా తిరస్కరించారని అలీ చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్లు కూడా తొలగించడంతో రోడ్డున పడినట్టు వాపోయాడు. అలీ కూలి పనులు చేస్తూ ఎక్కువ సమయం మసీదులో గడిపేవాడు. తన ఆరోగ్యం పాడయిందని, అందుకే పని చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఇంటికి వెళ్లి తన ప్రజలను చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. అలీకి  అవుట్‌పాస్ జారీ అయింది.  యునైటెడ్ PRO అసోసియేషన్ అని పిలువబడే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) బృందం అతనికి ఇంటికి వెళ్లేందుకు ఉచిత టిక్కెట్‌ను అందజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com