ఇక ఐదు రోజుల్లోనే పాస్‌పోర్టు రెన్యువల్!
- June 19, 2016
సౌదీలోని భారతీయులకు ఇది శుభవార్తే. పాస్‌పోర్టు రెన్యువల్ కోసం ఇక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. ఇక నుంచి ఐదంటే ఐదు రోజుల్లోనే పాస్‌పోర్టును రెన్యువల్ చేయనున్నట్టు భారత దౌత్య అధికారులు పేర్కొన్నారు. యూఏఈలోని ఇండియన్ పాస్‌పోర్టు అథారిటీతోపాటు ఇతర దేశాల్లో జారీ చేసిన పాస్‌పోర్టులను రెన్యువల్ చేయించుకునేందుకు గతంలో 40 పనిదినాలు పట్టేది. అయితే ఇక నుంచి ఆ వ్యవధిని తగ్గించి కేవలం ఐదు రోజుల్లోనే పాస్‌పోర్టులను రెన్యువల్ చేయాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు భావిస్తున్నారు. అబుధాబి నివాసులకు కూడా ఇదే వర్తిస్తుంది. ''ఐదు రోజుల్లోనే పాస్‌పోర్టులను రెన్యువల్ చేసి ఇవ్వాలని భావిస్తున్నాం.ఈ నెల నుంచే దీనిని ప్రారంభించాలనుకుంటున్నాం'' అని యూఏఈలో భారత రాయబారి టీపీ సీతారామన్ పేర్కొన్నారు. ఇండియాతో పాటు ఇతర దేశాల్లోని ఇండియన్ పాస్‌పోర్టు అథారిటీ జారీ చేసిన అన్ని పాస్‌పోర్టులకు ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. సీతారామన్ ప్రకటనతో భారత వలసదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







