ఎముకలు బలంగా వుండాలంటే.!

- September 06, 2024 , by Maagulf
ఎముకలు బలంగా వుండాలంటే.!

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడుతూ వుంటాయ్. తద్వారా కీళ్ల నొప్పులు తదితర ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయ్. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండానే కీళ్ల నొప్పులు వస్తున్నాయ్.

అలా కాకుండా వుండాలంటే డైట్‌లో కొన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వుంటుంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటూ, కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్ధాలను తప్పనిసరిగా తీసుకోవల్సిన ఆవశ్యకత వుంది.

అవి ఎముకలను ధృఢంగా చేయడంలో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, అందుకోసం ప్రత్యేకంగా ఖర్చు చేసేదేమీ లేదు. అవగాహన కోసం ఆ ఐటెమ్స్ ఏంటని తెలుసుకుంటే సరిపోతుంది.

కొబ్బరి నీళ్లు కేవలం వేసవి కాలంలో మాత్రమే తాగుతుంటాం. కానీ, సీజన్‌తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా వుంటాయని చెబుతున్నారు.కొబ్బరి నీళ్లలో కాల్షియం అధికంగా వుంటుంది.

గ్రీన్ టీ తాగే అలవాటు చాలా మందికి వుండదు. కానీ, గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు, ఎముకల్ని ధృడంగా మార్చడంలోనూ సహాయపడుతుంది.

గ్రీన్ టీలోని విటమిన్ ఎ, కాల్షియం, మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయ్. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులైన ఛీజ్, బట్టర్, పనీర్ అప్పుడప్పుడూ తీసుకుంటూ వుండాలి. వీటిలో కాల్షియం పుష్కలంగా వుంటుంది.  పండ్లలో యాపిల్‌కి ఎముకల్ని గట్టిగా చేసే గుణం ఎక్కువ.

అలాగే కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎముకల్లోని పటుత్వాన్ని తగ్గించేస్తాయ్. సో, కూల్ డ్రింక్స్ అలవాటున్న వారు వాటిని తగ్గించుకుంటే మంచిది. మద్యపానం అస్సలు మంచిది కాదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com