‘దేవర’ క్వాలిటీ ‘చెక్’.! చేయకుంటే భారీ మూల్యం తప్పదు మరి.!
- September 06, 2024ఎన్టీయార్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమానే ‘దేవర’. ఈ నెల అంటే సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చాక ఎన్టీయార్ నుంచి వస్తున్న సినిమా ఇది. అంటే ఏ రేంజ్‌లో వుండాలి. కానీ, ‘దేవర’కు అంత సీనుందా.? అంటే పెదవి విరిచేస్తున్నారు కొందరు.
అందుకు కారణం అస్సలు క్వాలిటీ లేని పాటలే. ఇంతవరకూ మూడు పాటలు రిలీజ్ చేశారు. రెస్పాన్స్ సో సోగానే వుంది ఈ మూడు పాటలకు. రీసెంట్‌గా వచ్చిన సాంగ్‌కి మిశ్రమ స్పందన వస్తోంది. డాన్స్ బాగానే చేశాడు కానీ, పాట లిరిక్స్‌లో కానీ, బ్యాక్ గ్రౌండ్ సెట్ వర్క్‌లో కానీ అస్సలు క్వాలిటీ, రిచ్‌నెస్ కనిపించడం లేదు.
ప్యాన్ ఇండియా సినిమా అంటే ఇలా వుంటే సరిపోతుందా.? సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది. మరి, ప్రమోషన్ల సంగతేంటీ.? అది కూడా అర్ధం కావడం లేదు.
కొరటాల శివ చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. తన రెగ్యులర్ స్ట్రేటజీని పక్కన పెట్టి ఈ సినిమా కోసం కొత్త మార్గాన్ని అనుసరిస్తాడా ప్రమోషన్లలో..సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వస్తూనే వున్నాయ్. అసలు నిర్మాణ సంస్థలైన యువసుధా ఆర్ట్స్, ఎన్టీయార్ ఆర్ట్స్ ఏం చేస్తున్నాయ్. ఇలా అయితే, ‘దేవర’ గట్టెక్కడం కష్టమే సుమీ.! ఇదీ నెటిజన్ల అభిప్రాయం.
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం