ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటున్న గ్యాంగ్ అరెస్ట్..
- September 06, 2024
హైదరాబాద్: ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్టు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారు మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.
నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షైక్ బడే సాహెడ్, మాలిక్, లక్మణా చారిని అరెస్ట్ చేసినట్లు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముందు ఉద్యోగం వచ్చిందంటూ ఒక నకిలీ గుర్తింపు కార్డు ఇస్తారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చిందని, త్వరలోనే రెగ్యులర్ అవుతుందని నమ్మిస్తారని చెప్పారు.
ఇలా చెప్పి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అంతేగాక, మూడు నెలలు జీతం అంటూ డబ్బులు కూడా లైన్ పేమెంట్స్ జీతాలు వేసి నమ్మిస్తారని అన్నారు. ఆదాయపన్ను శాఖ, ఎఫ్‌సీఐ, రెవెన్యూ, విద్యుత్తు, న్యాయస్థానల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈ ముఠా మోసాలకు పాల్పడిందని చెప్పారు.
ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. గతంలో వీరిపై ఖమ్మం టౌన్, చైతన్యపురి, సరూర్ ననర్, ఎల్బీ నగర్ పీఎస్‌లో చీటింగ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఎవరు చెప్పినా నమ్మొద్దని అన్నారు. ఈ గ్యాంగ్ 5.6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







