వాహనదారులకు గుడ్ న్యూస్....
- September 06, 2024
భారతదేశంలో ప్రతి ఒక్క వాహనదారులకు అతి త్వరలోనే అదిరిపోయే శుభవార్త రానుంది. డీజిల్, పెట్రోల్ ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉందని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. గురువారం రోజున పలు ఆంగ్ల టెలివిజన్ చానల్లలో ఈ విషయం గురించి తెలిసిన సమాచారాన్ని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
చివరిసారిగా కేంద్రం సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ మీద రూ. 2 రూపాయల చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అమలులోకి వచ్చాయి. అంతకు ముందు మాత్రం దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడప్పుడుకొన్ని ఒడుదోడుకుల నడుమ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భారీగా పెరగడం జరిగింది. ఈ క్రమంలో దేశీయంగా ఆయిల్ కంపెనీలు మాత్రం ధరలను పెంచలేకపోయాయి. అప్పటికే గరిష్టాలకు చేరగా.....స్థిరంగా ఉంచుతూ వచ్చాయి.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







