బహ్రెయిన్ లో స్వచ్ఛ బహ్రెయిన్ మరియు తెలుగు వారియర్స్ 30 వారాల వేడుకలు...
- September 06, 2024
మనామా: మహాత్మాగాంధీ ఆశయసాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మానసపుత్రిక స్వచ్చ భారత్ స్పూర్తితో ప్రవాస భారతీయులు తెలుగు వారియర్స్ గ్రూపు ప్లాస్టిక్ నుండి పర్యావరణాన్ని, సముద్రాలను కాపాడాలని స్థాపించిన 'స్వచ్ఛ బహ్రెయిన్' 30 వారాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు మరియు తెలుగు ప్రముఖులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేశారు.
కర్మభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలని చేస్తున్న ఈ కార్యాక్రమం 30 వారాలుగా చేస్తున్నందుకు కమిటి సభ్యులకు, స్థాపనకు ముఖ్యకారకులు అయిన కోటగిరి నవీన్ కుమార్ కి, 30 వారాలు క్రమం తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్న కెప్టెన్ మహేష్ మీరా కి ధన్యవాదాలు తెలియచేసారు. వ్యవస్థాపకుల్లో ఒకరైన కొత్తపల్లి రామ మోహన్.
వ్యవస్థాపక ముఖ్యసభ్యులు కోటగిరి నవీన్ కుమార్ మాట్లాడుతూ...భారతీయులకు అన్నివిధాల సహకరిస్తున్న బహ్రెయిన్ ప్రభుత్వానికి, సహకారం అందిస్తున్న తెలుగు సంఘాల వారికి , తెలుగు కళా సమితి సభ్యులకు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహ్రెయిన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. స్వచ్చ బహ్రెయిన్ స్థాపనక గల కారణాలను, కమిటీ విది విధానాలను, లక్ష్య సాధనకు తెలుగు వారందరూ కలిసి పనిచేయాలన్న అవశ్యకతను తెలియచేసారు.
తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్, రఘునాథ బాబు, మురళి కృష్ణ, హరి బాబు, ప్రేమ్ సాగర్, సతీష్, నోముల మురళి, అనిల్ ఆరే, చంద్రబాబు, గంగసాయన్న, రాజ్ కుమార్, రాజ శేఖర్ కొత్తపల్లి, వాసుదేవ రావు, రాయుడు వెంకటేశ్వర రావు , సురేష్, శ్రీ రామ్, నోయల్ , విఠల్ అరే, మహేశ్వేర రెడ్డి , మౌళి, వంశీ కృష్ణ, సందీప్ మరియు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహరైన్ సభ్యులు, తెలుగు ప్రముఖులు హాజరై తెలుగు వారియర్స్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియచేసారు.
తెలుగు వారియర్స్ కమిటీ సభ్యులు నవీన్ కుమార్, రామ మోహన్ కొత్తపల్లి, పెప్సీ అశోక్, గంగాధర్, తిరుపతి, అరవింద్, మహేష్ మీరా, నవీన్ , గంగా రెడ్డి , రంజిత్, పరమేశ్వర్, సుమన్, పెప్సీ సుమన్, సతీష్, శేఖర్, వంశీ కృష్ణ, సురేష్, నవీన్ కుమార్, పెప్సీ సురేష్ , శ్రీ కుమార్, శ్రీనివాస్ , రాజేష్, నరసా రెడ్డి, నరేందర్, రాజు, తిరుపతి గౌడ్ , సాయి కుమార్ , అజయ్ , రవి, శ్యామ్, కిరణ్ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియచేసుకుని స్వీట్స్ పంపిణిచేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన జలవిపత్తుకు తెలుగు వారు అందరూ కలిసి ముఖ్యమంత్రుల సహాయనిధి కి అందరూ సహకరించాలని తెలుగుదేశం బహరైన్ అధ్యక్షులు రఘునాథబాబు కోరడమైనది.స్వచ్ఛ బహ్రెయిన్/తెలుగు వారియర్స్ కమిటీ కి అన్నివిధాల సహాకరిస్తామని తెలుగు కళాసమితి మాజీ అధ్యక్షులు టి హరిబాబు, మురళి కృష్ణ , రాజ శేఖర్ కొత్తపల్లి , వాసుదేవరావు, నోముల మురళి, రాయుడు మరియు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహ్రెయిన్ సభ్యులు తెలియచేసారు.
బహ్రెయిన్ లో వివిధ సంఘాల ఆద్వర్యంలో జరిగే గణపతి ఉత్సవాలకు అందరు హాజరై మతసామరస్యాన్ని చాటి దేవుని ఆశీస్సులు పొందాలని తెలుగు కళాసమితి అధ్యక్షులు జగదీష్ రాజ్ కుమార్, గంగాసాయన్న, చంద్రబాబు మరియు పెప్సీ గణేష్ కమిటీ నిర్వాహకులు అశోక్, గంగాధర్, తిరుపతి మరియు పద్మశాలి బహరైన్ కమిటీ సభ్యులు పరమేశ్వర్, వంశీ కృష్ణ తదితరులు తెలియచేసారు.
ఈ కార్యక్రమానికి మంచినీళ్లు , జ్యూస్, స్వీట్స్ ఏర్పాట్లు చేసిన రఘునాద బాబు, అశోక్, అనిల్ ఆరే, శేఖర్, సురేష్ బాబు మరియు మహేష్ కు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!