డబ్బును రెట్టింపు.. నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్.. యువకుడు అరెస్ట్..!
- September 07, 2024
మనామా: ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడులను రెట్టింపు చేస్తానని నలుగురు వ్యక్తులను మోసగించిన 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి అభియోగాలు మోపినట్టు సెక్యూరిటీ డైరెక్టరేట్ వెల్లడించింది. బాధితుల నుంచి నిధులను స్వీకరించిన తర్వాత లాభాలను అందించడంలో విఫలమయ్యాడని, వారి ప్రారంభ పెట్టుబడులను తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని అధికారులు తెలిపారు.
ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా తమ పెట్టుబడులపై లాభదాయకమైన రాబడిని ఇస్తానని నిందితుడు పలువురిని మోసగించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి మొదట నమ్మించేందుకు వీలుగా కొంత అమౌంట్ ను బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. దీంతో 40% లాభం వచ్చినట్టు బాధితులను నమ్మించాడు. ఇలా బాధితుల వద్ద పెద్దమొత్తంలో నిధులను సేకరించిన తర్వాత తప్పించుకోవడం ప్రారంభించాడు. వారి నిధులను తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా డబ్బు రెట్టింపు చేస్తానని పలువురిని నిందితుడు నమ్మించి మోసం చేసినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. అయితే, నిందితుడు నలుగురు బాధితుల వద్ద నుంచి మొత్తం BD65,000 అందుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. అతను ఆన్లైన్ ట్రేడింగ్‌లో నిధులను పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నాడు. అయితే, లావాదేవీలు విజయవంతం కాకపోవడంతో మొత్తం డబ్బును పోగొట్టుకున్నట్లు తెలిపాడు. పెట్టుబడి సలహాదారుగా పనిచేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ నుండి తనకు లైసెన్స్ లేదని చెప్పాడు. మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో బాధితుల నుండి డబ్బును స్వీకరించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!