నైజీరియాలో ఘోర ప్రమాదం..48 మంది మృతి
- September 09, 2024
నైజీరియా: నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 48 మంది మరణించినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 50 వరకు పశువులు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఏడాదిలో అక్కడ జరిగిన ఘటనల్లో ఇదే అతిపెద్దది.
నైజీరియాలో నార్త్- మధ్య నైజర్ రాష్ట్రంలోని ఆగాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు చుట్టుపక్కన వాహనా లకు అట్టుకున్నాయి. ట్రక్కులో ఉన్న 50 పశువులు సజీవ దహనమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో 30 మంది సజీవ దహనమయ్యారు. మరో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులకు సమీపంలోని ఓ ప్రాంతంలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. నైజీరియాలో సరైన రైల్వే వ్యవస్థ లేదు. ముఖ్యంగా కార్గో రవాణాకు కేవలం వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాబా కలిగిన నైజీరియాలో ఆ తరహా ప్రమాదాలు సాధారణంగా చెబుతున్నారు. 2020లో 1,531 ప్రమాదాలు జరగగా 535 మంది మరణించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







