ఆమ్నేస్టి సమయంలో గల్ఫ్ కార్మికుల కోసం ఉచిత విమాన టికెట్ అందజేయాలి...

- September 09, 2024 , by Maagulf
ఆమ్నేస్టి సమయంలో గల్ఫ్ కార్మికుల కోసం ఉచిత విమాన టికెట్ అందజేయాలి...

దుబాయ్: యూఏఈలో ఆమ్నేస్టి ప్రకటించడం జరిగింది.చాలా కాలంగా దుబాయ్ లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు ఇంటికి ఎలాంటి అపరాధ రుసుము జైలు శిక్ష లేకుండా భారత్కు వెళ్లడానికి ఇది మంచి అవకాశం దీన్ని ప్రకటించినటువంటి యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదములు అదేవిధంగా గల్ఫ్ సోదరులందరూ ఈ సమయాన్ని  సద్వినియోగించుకోవాలనిఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ కన్వీనర్ కుంబాల మహేందర్ రెడ్డి కోరారు.ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 అక్టోబర్ 2024 తేదీ వరకు ఉంటుంది.ఈ సమయంలో దుబాయ్ లో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్నటువంటి  గల్ఫ్ కార్మికుల కోసం కావాల్సినటువంటి పత్రాలను పోలీస్ వెరిఫికేషన్ ను, పాస్పోర్ట్ లను ఇవన్నీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి భారత కౌన్సిలర్ ఆఫీసర్లు మరియు రాయబార కార్యాలయంకు చెందినటువంటి అధికారులు సులువుగా వారికి అనుమతి పత్రాలు చేసి ఇస్తున్నారు కావున దుబాయ్ నుండి హైదరాబాదుకు పంపించడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దుబాయ్ లో ఉన్నటువంటి ఉభయ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ అధికారులను దుబాయ్ కు పంపించి కార్మికులకు ఉచిత విమానయాన సదుపాయాన్ని కల్పించి, దుబాయ్ నుండి హైదరాబాద్ కు  విమాన టికెట్లు ఉచితంగా ఇవ్వగలరని ఇండియన్ పీపుల్స్ ఫోరం దుబాయ్ తరఫున కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో కుంబాల మహేందర్ రెడ్డి (కన్వీనర్ ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ ),డొక్కా శ్రీని,అపర్ణ, హరి, వేణుగోపాల్,రాజు, శ్రీనివాస్,నిమ్మల కృష్ణ, కృష్ణ మేగీ తదితరులు పాల్గొనడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com