ఖతార్ టూరిజం.. 2029 నాటికి 86% ఆదాయం..!
- September 09, 2024
దోహా: ఖతార్ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అయిన స్టాటిస్టా తాజా అప్‌డేట్‌ల ప్రకారం.. 2024లో ట్రావెల్ అండ్ టూరిజం ఆదాయం $1,168m (QR4,262.366m)గా ఉంది. 2.95% వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి $1,351m (QR4,930.185m) మార్కెట్ పెరుగుతుందన్నారు. ఖతార్ ట్రావెల్, పర్యాటక రంగంలో అతిపెద్ద భాగం హోటల్స్ మార్కెట్ అని, 2024లో $526.2m (QR1,919.524m) గా అంచనా వేశారు.
“2029 నాటికి హోటల్స్ రంగంలో విజిటర్స్ సంఖ్య 1,589,000కి చేరుకుంటుందని అంచనా. 2024లో వినియోగదారుల వృద్ధి రేటు 72.4%గా ఉంది. ఇది 2029 నాటికి 85.7%కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. స్టాటిస్టా అంచనాల ప్రకారం ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU) $589.30 (QR2,149.429)గా లెక్కకట్టారు. 2029 నాటికి ఖతార్ ట్రావెల్ అండ్ టూరిజం మార్కెట్‌లోని మొత్తం ఆదాయంలో 86% ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా రానుంది. యునైటెడ్ స్టేట్స్ 2024లో అత్యధిక ఆదాయాన్ని($214bn) ఆర్జిస్తుందని అంచనా. ఖతార్‌లోని ట్రావెల్ అండ్ టూరిజం మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది.’’ అని స్టాటిస్టా తన నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







