సౌదీ అరేబియాలో 23,871 మందిపై పాస్‌పోర్ట్ డైరెక్టరేట్ చర్యలు..!
- September 09, 2024
రియాద్: గత హిజ్రీ నెల సఫర్లో నిబంధనలు ఉల్లంఘించిన 23,871మందిపై చర్యలు తీసుకున్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలలో పాస్‌పోర్ట్ విభాగాల ఆధ్వర్యంలోని అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు రెసిడెన్సీ లా, లేబర్ లా, బోర్డర్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులకు జైలుశిక్ష, జరిమానాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రవాసులు జైలుశిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ సందర్భంగా రవాణా, ఉద్యోగం లేదా ఆశ్రయం ఇవ్వవద్దని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలోని ఫోన్ నంబర్ 911.. కింగ్‌డమ్‌లోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్‌కు ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







