క్రూయిజ్ ప్రయాణికులకు 10 రోజుల ఉచిత వీసా: ఒమన్

- September 09, 2024 , by Maagulf
క్రూయిజ్ ప్రయాణికులకు 10 రోజుల ఉచిత వీసా: ఒమన్

మస్కట్: ఒమన్‌కు క్రూయిజ్ షిప్‌లలో వచ్చే ప్రయాణికులు, సిబ్బందికి 10 రోజుల ఉచిత విజిట్ వీసా మంజూరు చేయనున్నారు. ఒమన్‌లోని పర్యాటక పరిశ్రమ వృద్ధికి ఈ నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడంలో సహాయపడుతుందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ హిస్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ జనరల్ హసన్ బిన్ మొహసేన్ అల్ షురైకి తెలిపారు. ఈ మేరకు విదేశీయుల నివాస చట్టంలోని కార్యనిర్వాహక నిబంధనలలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ నెం. 132/2024 ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com