జూనియర్ దీపిక వచ్చేసిందోచ్.!

- September 09, 2024 , by Maagulf
జూనియర్ దీపిక వచ్చేసిందోచ్.!

అందాల భామ దీపికా పదుకొనెకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ‘కల్కి’ సినిమాలో కృష్ణ పరమాత్మకు జన్మనివ్వబోయే తల్లిగా ప్రెగ్నెంట్ పాత్రలో నటించిన దీపికా పదుకొనె ఆ సినిమా ప్రమోషన్ల నాటికి నిజంగానే తల్లయ్యింది.

నిండు గర్భంతోనే ప్రమోషన్లకు హాజరయ్యింది. గర్భిణీ అయిన దీపికా పదుకొనెని చిత్ర యూనిట్ చాలా అపురూపంగా చూసుకున్నారు. ఇటీవలే ఆమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే.

తల్లిని కాబోతున్నా.. అనే విషయాన్ని ప్రకటించినప్పుడే సెప్టెంబర్‌లో గుడ్ న్యూస్ చెబుతామని దీపికా దంపతులు ప్రకటించేశారు. ఆ టైమ్ రానే వచ్చింది. సెప్టెంబర్ 8 ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు దీపికా - రణ్‌వీర్ దంపతులు. 2018లో దీపికా, రణ్‌వీర్ సింగ్ వివాహం చేసుకున్నారు. ‘రామ్ లీలా’ సినిమా కోసం తొలిసారి జత కట్టిన ఈ జంట ఆ సినిమా టైమ్‌లోనే లవ్‌లో పడింది.

ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లిపీటల వరకూ చేరింది. ఓ వైపు వైవాహిక బంధాన్ని ఆనందంగా అనుభవిస్తూనే మరోవైపు కెరీర్‌నీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించారు ఈ జంట. ఇక ఇప్పుడు వారసురాల్ని కూడా పొందడంతో ఈ జంట ఆనందానికి అవధుల్లేవ్. ఈ నేపథ్యంలో దీపికా రణ్‌వీర్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com