బోర్ కొట్టేసింది.! ప్యాటర్న్ మార్చాలి బిగ్‌బాస్.!

- September 09, 2024 , by Maagulf
బోర్ కొట్టేసింది.! ప్యాటర్న్ మార్చాలి బిగ్‌బాస్.!

బిగ్‌బాస్‌లోకి ఆంటీల్ని ఎందుకు తీసుకొస్తార్రా బాబూ.! అందుకేనా.! అదేనండీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కోసమేనా... ఇవీ తాజాగా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8పై వస్తున్న ట్రోలింగ్స్.

మొదటి సీజన్ నుంచీ తీసుకుంటే, ఫస్ట్ సీజన్‌లో విషయమున్నయంగ్‌స్టర్ సంజననే బయటికి పంపించేశారు. ఆ సందర్భంలో చాలానే గొడవలు జరిగాయనుకోండి. ఆ తర్వాతి నుంచీ ఆంటీల్ని హౌస్‌లోకి ఎంటర్ చేయడం.. ఫస్ట్ వీక్‌ ఎలిమినేషనలో భాగంగా వాళ్లని నెట్టేయడం.

ఇదే తంతు. ఆ వారం రోజులూ ఆ ఆంటీలని కిచెన్ డ్యూటీలో భాగం చేయడం. ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజా సీజన్ర‌లోనూ ఇదే జరిగింది.

బెజవాడ బేబక్క.. దుమ్ము రేపేస్తా.. దూల తీర్చేస్తా.. అంటూ ఎంట్రీ ఇచ్చిన బేబక్కను ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్ నుంచి బయటికి పంపించేశారు.

ఈ సీజన్ అంత తోపు.. ఇంత తోపు.. అని ప్రోమోస్‌లో ఊదరగొట్టిన హోస్ట్ నాగార్జున, పాత ప్యాటర్న్‌నే ఫాలో చేస్తున్నారు.. కాస్త ప్యాటర్న్ మార్చాలనీ, కొత్తగా ఏమైనా చేయాలనీ, టాస్కుల రూపంలో ఇచ్చే గేమ్స్ కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా లేవంటూ ఈ సీజన్ బిగ్‌బాస్‌పై పెదవి విరిచేస్తున్నారు వీక్షకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com