‘అపరిచితుడు’ హిందీ రీమేక్ అట.! శంకర్‌లో ఇదివరకటి దమ్ముందా.?

- September 09, 2024 , by Maagulf
‘అపరిచితుడు’ హిందీ రీమేక్ అట.! శంకర్‌లో ఇదివరకటి దమ్ముందా.?

2005లో వచ్చిన సినిమా ‘అపరిచితుడు’. విక్రమ్ నట విశ్వరూపమీ సినిమా. భాషతో సంబంధం లేకుండా సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద సృష్టించింది.

శంకర్ వెండితెరపై క్రియేట్ చేసిన అద్భుతమైన దృశ్య కావ్యం కూడా. అలాంటి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు శంకర్ 2021లోనే సన్నాహాలు చేశారు. అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది.

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాలని శంకర్ సన్నద్ధమయ్యారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందని ప్రకటించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, కొన్ని కోర్టు ఇష్యూస్‌తో ఈ సినిమా ఆగింది.

తాజాగా ఈ విషయం విక్రమ్ నటించిన ‘తంగలాన్’ ప్రమోషన్ల టైమ్‌లో మళ్లీ చర్చకొచ్చింది. చర్చకొచ్చింది సరే, కానీ, అప్పటి శంకర్ వేరు. ఇప్పుడు శంకర్ వేరు. రీసెంట్‌గా ‘భారతీయుడు 2’తో శంకర్‌లో సినిమా అయిపోయిందని తేల్చేశారు అభిమానులే.

అలాంటిది సంచలనాత్మకమైన చిత్రం ‘అపరిచితుడు’ రీమేక్ అంటే మాటలా మరి. హీరో ఎంపిక బాగానే వుంది. ‘రణ్‌వీర్ సింగ్ ఖచ్చితంగా ఈ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లగలడు తనదైన నటనతో. కానీ, తెరకెక్కించడంలో శంకర్‌కే ఆ దమ్మందా.? ఒకవేళ సినిమా రూపొందినా అప్పటిలా సంచలనాలు క్రియేట్ చేయగలదా.? ఇలాంటి ఎన్నో అనుమానాలీ సినిమాపై. ఈ అనుమానాలన్నింటికీ చెక్ పడాలంటే ‘గేమ్ ఛేంజర్’ హిట్ అవ్వాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com