ఇండియాలో మూడు తరాల సంప్రదాయాన్ని సజీవంగా నిలిపిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్..!

- September 10, 2024 , by Maagulf
ఇండియాలో మూడు తరాల సంప్రదాయాన్ని సజీవంగా నిలిపిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్..!

యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాజ్‌ఘాట్ వద్ద అమల్టాస్ (కాసియా ఫిస్టులా) మొక్కను నాటారు.అయితే, ఇండియాలో పర్యటిస్తున్న బుదాబి క్రౌన్ ప్రిన్స్ యూఏఈ రాజ కుటుంబం నుండి మూడవ తరం నాయకుడిగా గుర్తింపు పొందారు.రాజ్‌ఘాట్ చరిత్రలో ఒకే దేశం నుండి మూడు తరాల నాయకులు మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించి చెట్లను నాటడం ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇది ఇండియా-యూఏఈ దేశాల మధ్య లోతైన సంబంధాన్ని సూచిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌ పోస్ట్‌లో వెల్లడించారు. 1992లో యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ భారతదేశ పర్యటన సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద అమల్టాస్ (కాసియా ఫిస్టులా) మొక్కను నాటారు. 2016లో అతని కుమారుడు, ప్రస్తుత యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మోల్శ్రీ (మిముసోప్స్ ఎలెంగి) మొక్కను నాటడం ద్వారా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com