కారు ప్రమాదంలో పక్షవాతానికి గురైన డెలివరీ రైడర్.. Dh5 మిలియన్ పరిహారం అందజేత..!
- September 10, 2024
యూఏఈ: కారు ప్రమాదంలో పక్షవాతానికి గురైన 22 ఏళ్ల కిరాణా డెలివరీ రైడర్‌కు ఎట్టకేలకు పరిహారం లభించింది. అతని కుటుంబానికి 5 మిలియన్ దిర్హామ్‌లను పరిహారంగా అందించారు. అతని న్యాయవాదుల కథనం ప్రకారం.. ప్రమాదం తర్వాత షిఫిన్ ఉమ్మర్ కుమ్మలి 100 శాతం పక్షవాతానికి గురయ్యాడు.అల్ ఐన్‌లోని కిరాణా దుకాణంలో పనిచేసిన షిఫిన్ 2022 మార్చిలో డెలివరీ చేయడానికి వెళ్తుండగా అరబ్ యువకుడు నడుపుతున్న కారు అదుపుతప్పి అతని బైకును ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. అధికారులు సిసిటివి ఫుటేజీని పరిశీలించి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి 5,000 దిర్హామ్‌ల జరిమానా విధించగా, వారి చట్టపరమైన ఖర్చుల కోసం అతడి కుటుంబానికి అదనంగా 73,000 దిర్హామ్‌లు కూడా అందించారని ఫ్రాంగుల్ఫ్ అడ్వకేట్స్‌లో డైరెక్టర్ మరియు కన్సల్టెంట్ అనీస్ ఈసా తెలిపారు. షిఫిన్ తన మోటార్‌సైకిల్ కు రెండూ ఇన్సూరెన్స్ లు చేయించడం కలిసివచ్చిందన్నారు. బాధితుడు యువకుడు కావడం, వాళ్ల పేరెంట్స్ కు అతడే ఆధారం కావడం, అలాగే పక్షవాతానికి గురైన యువకుడికి సేవలు అందించడానికి వాళ్ల పాధర్ జాబ్ ను వదిలేయాల్సి వచ్చిందని.. ఇవన్నీ కోర్టులో పరిహారం అందేందుకు ప్రధాన కారణాలు అని కోర్టులో షిఫిన్ తరపున ప్రాతినిధ్యం వహించిన ఎమిరాటీ న్యాయవాది ఫరీద్ అల్ హసన్ తెలిపారు. అంతకుముందు ఇన్సూరెన్స్ అథారిటీ కోర్టు షిఫిన్ కుటుంబానికి 2.8 మిలియన్ దిర్హామ్‌లను పరిహారంగా ఇచ్చింది. షిఫిన్ గాయాల తీవ్రతతో పాటు అతని భవిష్యత్ వైద్య అవసరాలను గుర్తించిన న్యాయ బృందం అధిక మొత్తం కోసం కోర్టును ఆశ్రయించింది. చివరకు వారి ప్రయత్నాలు ఫలించడంతో బాధిత యువకుడి కుటుంబానికి అప్పీలేట్ కోర్ట్ పరిహారాన్ని 5 మిలియన్ దిర్హామ్‌లకు పెంచి ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును తరువాత సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..