గాజా పై ఇజ్రాయెల్ బాంబుల దాడి.. 40 మంది మృతి
- September 10, 2024
గాజా: హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నది. దక్షిణ గాజా స్ట్రిప్పై జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డారు. గాజా పట్టీలోని ఖాన్ యునిస్, అల్-మవాసిలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పిడింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో దీనిని సురక్షితమైన జోన్ అని, ఎలాంటి దాడులు జరగబోవని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయినప్పటికీ దాడికి పాల్పడడం గమనార్హం. అయితే, హమాస్ కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడులు చేశామంటూ సైన్యం పేర్కొంది. గ్రాజా స్ట్రిప్లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు, సైన్యానికి వ్యతిరేంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందుకే దాడి చేస్తున్నట్లు పేర్కొంది.
కాగా, దాడి రాత్రిపూట దాడి జరిగిందని, 40 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. స్థానిక శిభిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, దీంతో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 15 మంది ఆచూకీలేకుండా పోయారని తెలిపారు. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







