‘దేవర’ అసలు సిసలు అగ్ని పరీక్ష ఇప్పుడే.!
- September 10, 2024
ఎన్టీయార్ ప్రెస్టీజియస్ మూవీ ‘దేవర’కు అసలు సిసలు అగ్ని పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఈ రోజు అనగా సెప్టెంబర్ 10న ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్లు.
ఈ సినిమాని ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువ సుధా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ కొన్ని ప్రోమోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే వాటికి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ట్రైలర్ మాత్రం ఓ రేంజ్‌లో కట్ చేశారని అంటున్నారు. ట్రైలర్‌తో అంచనాలన్నీ మారిపోతాయని అంటున్నారు. 2 నిమిషాల 50 సెకన్ల నిడివి వున్న ఈ ట్రైలర్‌తో పక్కాగా ఓ ఐడియా వస్తుందని అంటున్నారు.
మరి, నిజంగానే అంచనాలు పెంచేలా వుంటుందా ఈ ట్రైలర్ చూడాలి మరి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని ధియేటర్లలో చూడాలంటే మరో 17 రోజులు వెయిట్ చేయాల్సిందే. సెప్లెంబర్ 27న ‘దేవర’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!