నోటి దుర్వాసన పోవాలంటే ఈ సింపుల్ టిప్స్ తెలుసా.?
- September 10, 2024
నోటి నుంచి వచ్చే దుర్వాసనకు స్నేహితులెవ్వరూ దగ్గరికి చేరరు. అందుకే నోటి దుర్వాసనను దరి చేరనీయకుండా చేసుకోవాలంటే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటించొచ్చు.
నేచురల్ రెమిడీస్‌తోనే నోటి దుర్వాసనను ఈజీగా పొగొట్టుకోవచ్చు. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. వంటల్లో వాడుకోవడమే కాకుండా.. పుదీనా ఆకుల్ని రెగ్యులర్‌గా నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
అలాగే యాలకులు కూడా నోటి దుర్వాసనను పోగొట్టడానికి తోడ్పడతాయ్. యాలికల్ని నోటిలో వేసి చప్పరించినా నోటి దుర్వాసన రాదు. అలాగే, దాల్చిన చెక్క, సోంపు వంటివి నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఉపకరిస్తాయ్.
ఫ్లోరైడ్ ఎక్కువగా వున్న టూత్ పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. అలాగే, దంతాలతో పాటూ, నాలుకను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
అంతేకాదు, ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు బ్రష్ చేసుకుంటూ వుండాలి. వీటన్నింటికీ మించి రోజులో 8 గ్లాసుల వాటర్ తాగుతుండాలి. నోరు పొడిబారిపోవడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే వాటర్ కంటెంట్ శరీరంలో ఎక్కువగా వుండేలా చూసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగుతుండాలి.
తాజా వార్తలు
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!







