కమల్‌హాసన్, శ్రుతిహాసన్ సరదాగా లాస్ఏంజెల్స్లో
- June 19, 2016
విశ్వ నటుడు కమల్‌హాసన్, ఆయన కుమార్తె శ్రుతిహాసన్ కలిసి లాస్ఏంజెల్స్లోని థియేటర్లో సరదాగా గడిపారు. కమల్ ప్రధాన పాత్రలో 'శభాష్ నాయుడు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లాస్ఏంజెల్స్లో జరుగుతోంది. ఇందులో భాగంగా షూటింగ్ సెట్‌కు సమీపంలోని థియేటర్‌ను తన కుమార్తె శ్రుతిహాసన్‌తో కలిసి అలా సరదాగా చూడడానికి వెళ్లినట్లు కమల్‌హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతోపాటు థియేటర్లో దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









