‘దేవర’ను కాపాడేదెవ్వరు.?
- September 11, 2024
ఎట్టకేలకు ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ పైనే అందరి ఆశలూ.. మరి ఆ ఆశలు తీరి అంచనాల్ని అందుకునేలా ట్రైలర్ వుందా.? అంటే ఖచ్చితంగా చెప్పడానికి లేదు.
ఎందకంటే, ‘దేవర’ సినిమాపై చాలా చాలా అంచనాలున్నాయ్. ఆ అంచనాల్ని అందుకోవడంలో ట్రైలర్‌ది కీలక పాత్ర కావల్సి వుంది. కానీ, మిశ్రమ స్పందన వినిపిస్తోంది.
ఇటీవల విడుదలైన గోపీచంద్ ‘భీమా’ సినిమా కథని పోలి వుందనీ, మెగా డిజాస్టర్ మూవీ కొరటాల కంపెనీ నుంచి వచ్చిన ఆణిముత్యం ‘ఆచార్య’ లక్షణాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా వున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
‘ఆచార్య’ కలర్ టోన్‌ని మిస్ చేయలేదు. అక్కడ ఓ పానవట్టం అనే ఊరు.. ఇక్కడ సముద్ర ఘట్టం కాన్సెప్ట్.. అంతే తేడా. ఇక ‘భీమా’ని పోలినట్లు డబుల్ రోల్..
సో, ‘దేవర’పై అనుమానాలు మొదలయ్యాయ్. అసలే ఎన్టీయార్‌కి డబుల్ రోల్ చేసిన సినిమాలేమీ కలిసి రాలేదింతవరకూ. అలాంటిది, ప్రెస్టీజియస్ మూవీని కొరటాల చేతుల్లో ఎందుకు పెట్టాడా ఎన్టీయార్.. అంటూ ఆయన అభిమానులే ఆందోళనలో పడ్డారు. చూడాలి మరి, ‘దేవర’ను నిలబెట్టేదెవ్వరో.! కొన్నిసార్లు ట్రైలర్ ఫెయిలైనా, సినిమా బాగుండే ఛాన్సుంది. అలా ‘దేవర’కి ఏమైనా కలిసొస్తుందేమో.!
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…







