తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తోన్న మరో మలయాళ హీరో
- September 11, 2024
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. దాంతో, ప్రపంచం నలుమూలలా తెలుగు సినిమాల గురించీ, తెలుగు సినిమా హీరోల గురించీ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.
అంతేకాదు, తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా గుర్తిస్తున్నారిప్పుడు. అందుకే వివిధ భాషల నుంచి పలువురు ప్రముఖ నటీ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాగా, ఇటీవలే మళయాలంలో స్టార్ అనిపించుకుంటోన్న హీరో టోవినో థామస్ కూడా టాలీవుడ్‌పై మోజు పెంచుకుంటున్నాడు. తనకు ప్రబాస్, రామ్ చరణ్, ఎన్టీయార్ తదితర తెలుగు హీరోలంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు.
ఛాన్స్ వస్తే, తెలుగు సినిమాల్లో చిన్న రోల్ అయినా చేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెబుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఏఆర్ఎమ్’ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన ముద్దుగుమ్మలు కృతి శెట్టి, ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలోనే టోవినో థామస్ టాలీవుడ్ నుద్దేశించి పై విధంగా వ్యాఖ్యానించారు.
ఈ యంగ్‌స్టర్ హుషారు చూస్తుంటే, త్వరలోనే ఏదో ఒక తెలుగు సినిమాకి ఓకే చెప్పేసేలానే వున్నాడు. చూడాలి మరి. అన్నట్లు ఈ సినిమాని కృతి శెట్టి డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







