కథ డిమాండ్ చేస్తే ఎంత ఛాలెంజింగ్‌కైనా రెడీ అంటోన్న మిల్కీ బ్యూటీ.!

- September 11, 2024 , by Maagulf
కథ డిమాండ్ చేస్తే ఎంత ఛాలెంజింగ్‌కైనా రెడీ అంటోన్న మిల్కీ బ్యూటీ.!

మిల్కీ బ్యూటీ తమన్నాతో యాక్ట్ చేసిన కో స్టార్స్ అంతా ఆమె గురించి చెబుతూనే వుంటారు. నిరంతర విద్యార్ధి తమన్నా.. అని పలు మార్లు చాలా మంది హీరోలు చెప్పడం విన్నాం. నిజమే, స్టోరీ డిమాండ్ చేస్తే తమన్నా ఎంతకైనా సిద్ధమే.

అందుకు ఆమె పోషించిన పలు క్యారెక్టర్లు నిదర్శనం. ప్రత్యేక గీతాలు మొదలుకొని గెస్ట్ రోల్స్ వరకూ చాలా ఉదాహరణలున్నాయ్.

అదే ఆమెను కెరీర్‌లో ఇంత దూరం సక్సెస్‌ఫుల్‌గా నడిపించిందనుకోవచ్చు. తాజాగా తమన్నా ‘స్త్రీ 2’లో నటించింది. ఈ సినిమాలో గెస్ట్ రోల్‌తో పాటూ ఓ స్పెషల్ సాంగ్‌లోనూ తమన్నా నటించింది.

అయితే, కొన్ని నిమిషాల పాటు మెరిసిన గెస్ట్ రోల్‌కి సంబంధించి తమన్నా నిజంగానే రిస్క్ చేసిందనుకోవచ్చు. తమన్నా వంటి ఓ స్టార్ హీరోయిన్ బట్ట తలతో కనిపించడానికి ఒప్పుకోవడం అంటే.. అది చిన్న విషయం కాదు.

కానీ, కథలో ఆ పాత్ర చిన్నదే అయినా ఎంత కీలకమో అర్ధం చేసుకుంది కాబట్టి.. ఆ పాత్రకు ఓకే చెప్పింది ఆ పాత్రను ఎంచుకోవడం కోసం డైరెక్టర్ చాలానే కసరత్తులు చేశాడట. ఫైనల్‌గా తమన్నాని సంప్రదించడం.. కథ చెప్పగానే తమన్నా పాజిటివ్‌గా స్పందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ.. తమన్నాని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు.

నటన పట్ల ఎంతో ప్యాషన్ వుంటేనే ఇలాంటి పాత్రలకు హీరోయిన్లు ఒప్పుకుంటారు.. అని సినీ విమర్శకులు సైతం తమన్నాకి కితాబిచ్చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమన్నా ఇలాంటి మరెన్నో ఛాలెంజింగ్ పాత్రలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com