మరో 10 వందే భారత్ రైళ్లు లాంచ్..
- September 13, 2024
న్యూ ఢిల్లీ: భారత్ లో మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు వందే భారత్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది.
ఈనెలలోనే మరో 10 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
రాబోయే రైళ్లు టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా), రూర్కెలా-హౌరా, హౌరా-గయా, ఆగ్రా-వారణాసితో సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరింపజేయనున్నాయి. రైల్వే వ్యవస్థను ఆధునీకరించే భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఈ రైళ్లు హై-స్పీడ్ సామర్థ్యాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా అధునాతన సౌకర్యాలు ఏర్పటు చేశారు. ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇటీవలే ప్రధాని మోడీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మీరట్ నుంచి లక్నో, మధురై నుంచి బెంగళూరు, చెన్నై నుంచి నాగర్కోయిల్లను కలుపుతూ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







