సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలకు విరామం..!!
- September 14, 2024
దుబాయ్: ప్రవక్త ముహమ్మద్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలు అందుబాటులో ఉండవని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) ప్రకటించింది. తమ వీసా స్థితిని క్రమబద్ధీకరించుకోవాలనుకునే లేదా దేశం నుండి వెళ్లాలనుకునేవారు తుది గడువు కంటే ముందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్ అవీర్‌లోని స్టేటస్ రెగ్యులరైజేషన్ సెంటర్‌లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారాల్లో ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. యూఏఈలో వీసా క్షమాభిక్ష పథకం సెప్టెంబర్ 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది అక్రమ ప్రవాసులు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఎమిరేట్స్ విడిచి వెళ్లారు.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







