ఫాల్కన్రీ ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఆటో ఎగ్జిబిట్‌లు..!!

- September 14, 2024 , by Maagulf
ఫాల్కన్రీ ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఆటో ఎగ్జిబిట్‌లు..!!

దోహా: కటారా ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఫాల్కన్స్ ఎగ్జిబిషన్ ( S'hail 2024 ) ఖతార్,  విదేశాల నుండి ఫాల్కన్రీ ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఈవెంట్‌లో ఆఫ్-రోడ్ వాహనాలు ఉంటాయని, ఇవి సాహసాలు, అన్వేషణలు, యాత్రలను ప్రారంభించాలనుకునే వేట ఔత్సాహికులకు అనువైనవని ఎగ్జిబిట్ చేస్తున్న 4WD కంపెనీల ప్రతినిధులు తెలిపారు.

ఖతార్‌లోని కారవాన్ తయారీ కంపెనీ యజమాని అహ్మద్ అల్-సదా మాట్లాడుతూ.. తాము పూర్తిగా స్థానిక వస్తువులతో తయారు చేసిన కార్వాన్‌లతో ప్రదర్శనలో పాల్గొంటున్నామని  చెప్పారు. కార్వాన్‌లలో రెండు బెడ్‌రూమ్‌లు, బాత్రూమ్, బాల్కనీ, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. వివిధ దేశాల రాయబారులు,  ప్రతినిధుల సమక్షంలో S'hail 2024 ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com