BD18,000 చెల్లించండి.. స్టేషనరీ స్టోరుకు కమర్షియల్ కోర్టు ఆదేశం..!!
- September 14, 2024
మానామా: తగినంత నిధులు లేకుండానే చెక్కులు ఇచ్చి మోసం చేసినందుకు వాణిజ్య సంస్థకు BD18,000 తిరిగి చెల్లించాలని కమర్షియల్ కోర్టు ఒక స్టేషనరీ దుకాణాన్ని ఆదేశించింది. స్టేషనరీ దుకాణానికి BD18,000 విలువైన వస్తువులను సరఫరా చేసిన వాణిజ్య సంస్థకు సదరు స్టేషనరీ దుకాణం చెక్కులను అందజేసింది. కానీ అవి నిధులు లేక బౌన్స్ అయ్యాయి. కంపెనీ సంప్రదించిన రెస్పాన్స్ లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. చెక్కుల చెల్లింపు గడువు ముగిసిందని గుర్తించిన కోర్టు.. కమర్షియల్ కోడ్ ఆర్టికల్ 81/1 ప్రకారం.. ప్రతి చెక్కు మెచ్యూరిటీ తేదీ నుండి సంవత్సరానికి 4% చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. చట్టపరమైన వడ్డీతో BD18,000 చెల్లించాలని స్టేషనరీ దుకాణం యజమానిని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఫీజు, లీగల్ ఫీజు కోసం BD50 చెల్లించాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..