వరల్డ్ అడ్వాన్స్ డ్ సైబర్ సెక్యూరిటీ.. అగ్రస్థానంలో ఒమన్..!
- September 14, 2024
మస్కట్: ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) విడుదల చేసిన 2024 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (GCI) ఎడిషన్ లో ఒమన్ సుల్తానేట్ ప్రపంచంలోని సైబర్ సెక్యూరిటీ వారీగా అత్యంత ఆధునాతన దేశాల టాప్ లిస్ట్‌లో స్థానాన్ని పొందింది. ఒమన్ పనితీరు 2020 ఇండెక్స్‌లో 96 పాయింట్లు ఉండగా.. 2024 సూచికలో 97.02 పాయింట్లకు పెరిగింది. ITU ఐదు ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. లీగల్, టెక్నికల్ , రెగ్యులేటర్ స్టాండర్డ్ వంటి విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరిచినట్టు తెలిపింది. "చట్టపరమైన ప్రమాణం"లో 19.59 పాయింట్లు, "సాంకేతిక ప్రమాణం"లో 18.39 పాయింట్లు మరియు "సామర్థ్య నిర్మాణ ప్రమాణం"లో 19.03 పాయింట్లను పొందినట్లు నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్‌లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..